మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 ఫిబ్రవరి 2023 (10:52 IST)

సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ కన్నుమూత

vidyasagar
vidyasagar
ప్రముఖ సీనియర్ దర్శకుడు విద్యాసాగర్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన చెన్నైలోని నివాసంలో కన్నుమూశారు. రాకాసి లోయ చిత్రంతో ఆయన దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. 
 
ఆపై అమ్మదొంగ, స్టూవర్టుపురం, రామసక్కనోడు, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెం.1, అన్వేషణ, ఓసి నా మరదలా వంటి చిత్రాలు తెరకెక్కించారు. సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. 
 
దర్శకుడు విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా, నిడమర్రు గ్రామంలో జన్మించారు. అతను ఎడిటింగ్ అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి 1990 సంవత్సరంలో విజయవంతమైన దర్శకుడిగా మారాడు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల సాగర్ దగ్గర అసిస్టెంట్‌గా తన దర్శకత్వ వృత్తిని ప్రారంభించాడు.