శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 21 ఆగస్టు 2024 (15:05 IST)

ప్రధాని మోడీని వెనక్కి నెట్టేసిన శ్రద్ధా కపూర్.. ఏ విషయంలో...

sraddha kapoor
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఆమె ఇన్‌స్టాఖాతాను 91.4 మిలియన్ల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. తద్వారా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని వెనక్కి నెట్టేశారు. 
 
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా అనుసరించబడే మూడో భారతీయురాలిగా ఆమె నిలిచారు. క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ, నటి ప్రియాంక చోప్రా తర్వాత శ్రద్దా ఈ ఘనత సాధించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 91.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. 
 
అయితే నరేంద్ర మోడీ 101 మిలియన్ల మంది ఫాలోవర్స్‌తో ట్విటర్‌లో అత్యధికంగా అనుసరించే గ్లోబల్ లీడర్‌గా అవతరించారు. ఇక శ్రద్ధా కపూర్ నటించిన తాజా చిత్రం "స్త్రీ-2" వరల్డ్ వైడ్‌గా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను అధికమించిన విషయం తెల్సిందే.