శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఏప్రియల్ 2021 (10:24 IST)

థ్యాంక్యూ కోవిడ్‌.. నీ వల్ల మేకప్ ‌మెన్‌ని అయ్యాను: జగపతి బాబు

Jagapathi Babu
కరోనా వేళ సినీ నటుడు జగపతి బాబు మేకప్ మ్యాన్‌గా మారాడు. కోవిడ్‌ దృష్ట్యా చాలా వరకు అసిస్టెంట్‌ల సహాయం తీసుకోకుండా తమ పనులు తామే చూసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. షూటింగ్ లొకేషన్లలో తమ పనులు తామే చూసుకుంటున్నారు.
 
తాజాగా ఓ షూటింగ్‌ లొకేషన్‌లో జగపతి బాబు తానే మేకప్‌మెన్‌గా మారిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ "థ్యాంక్యూ కోవిడ్‌.. నీ వల్ల మేకప్ ‌మెన్‌ని అయ్యాను" అంటూ ఫన్నీగా కామెంట్‌ చేశారు. 
 
ప్రస్తుతం ఆయన పలు సినిమాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌ పోషిస్తూ సత్తా చాటుతున్నారు. ఇకపోతే కరోనా రెండవ వేవ్ దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.