కువైట్, మస్కట్‌లలో షో పూర్తయిన కాటమరాయుడు: బ్లాక్ బస్టర్ అంటున్న అభిమానులు
శుక్రవారం విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌లో మారుమోగుతోంది. మరి కాస్సేపట్లో భారత్‌లో విడుదలవుతున్న ఈ సినిమా ఇప్పటికే కువైట్, మస్కట్‌లలో తొలి షో పూర్తయింద
శుక్రవారం విడుదలైన పవన్ కల్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమా బ్లాక్ బస్టర్ అంటూ ట్విట్టర్‌లో మారుమోగుతోంది. మరి కాస్సేపట్లో భారత్‌లో విడుదలవుతున్న ఈ సినిమా ఇప్పటికే కువైట్, మస్కట్‌లలో తొలి షో పూర్తయింది. (శుక్రవారం 3 గంటలకే అక్కడ సినిమా విడుదలైంది). పవర్ స్టార్ వన్ మ్యాన్ షో చేశారని, అత్తారింటికి దారేది తర్వాత మరో మెగా హిట్ పవన్ సొంతమని టాక్ వినిపిస్తోంది. గత చిత్రాలకు భిన్నంగా పంచెకట్టులో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఫస్టాఫ్‌కు కామెడీ ప్లస్ పాయింట్ అని, క్లైమాక్స్‌లో అన్నదమ్ముళ్ల మధ్య వచ్చే ఎమోషనల్, సెంటిమెంట్ సీన్లను దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేశారని.. ఓవరాల్‌గా పవన్ ఖాతాలో మరో హిట్ చేరిందన్న టాక్ వినిపిస్తోంది. హిరోయిన్ శ్రుతిహాసన్‌తో గబ్బర్‌సింగ్ తరహాలో కాకున్నా.. ఓ మాదిరి లవ్ ట్రాక్ ను రన్ చూపించారు. తమిళ మూవీ వీరమ్‌ను తెలుగులో తీసినప్పటికీ పవన్‌కు అనుగుణంగా స్పెషల్‌గా క్యారెక్టర్ ను తీర్చిదిద్దాడని అంటున్నారు.
సర్దార్ గబ్బర్‌సింగ్‌తో నిరాశచెందిన ఫ్యాన్స్.. కాటమరాయుడుతో పవన్ ఆ లోటు భర్తీ చేశాడని అంటున్నారు. బాక్సాఫీసు బద్ధలవుతుందని, బ్లాక్ బస్టర్ మూవీగా నిలుస్తుందని ట్వీట్లు చేస్తున్నారు. కాటమరాయుడుహంగామా అనే హ్యాష్ ట్యాగ్‌తో మూవీ అప్‌డేట్స్‌ను ఫ్యాన్స్ ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటున్నారు.
ఇతర రాష్ట్రాల్లోని తెలుగు అభిమానులతో పాటు విదేశాలలో ఉన్న పవన్ ఫ్యాన్స్‌కు ఈ మూవీ ఆశించినంత వినోదం పంచడం ఖాయమనిపిస్తోంది. పవన్ పక్కా మాస్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ టీజర్, సాంగ్స్‌కు వచ్చిన రెస్పాన్సే ఇప్పుడు మూవీకి వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో మెగా ఫ్యామిలీ అభిమానులు పటాసులు కాలుస్తూ సంబరాలు స్టార్ట్ చేశారు. గత చిత్రాలకు భిన్నంగా పంచెకట్టులో పవన్ కనిపించడమే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
కాటమరాయుడు సినిమా రివ్యూ ప్రాథమిక రేటింగ్ 3 నుంచి 4 వరకు చెబుతుండటంతో ఇది సూపర్ హిట్ జాబితాలోకి చేరినట్లే.