సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 మార్చి 2023 (16:08 IST)

ప్రభాస్‌ సలార్‌లో రెండు సీక్రెట్స్‌ దాగి వున్నాయి!

prabhas-salar
prabhas-salar
ప్రభాస్‌ సలార్‌ సినిమా ఎప్పటినుంచో షూటింగ్‌ జరుగుతుంది. మధ్యలో ఆది పురుష్‌ సినిమా కూడా జరిగింది. ఇలా అన్ని పాన్‌ ఇండియా మూవీలు చేసుకుంటూ బిజీగా వున్న ప్రభాస్‌ తాజాగా ఆదిపురుష్‌ జూన్‌లో కొత్త అప్‌డేట్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇక తాజాగా దర్శకుడు ఓం రౌత్‌కూడా ఈ విషయాన్ని చెప్పాడు. టీ సీరీస్‌ నిర్మాణ సంస్థకూడా మంచి అప్‌డేట్‌ ఇవ్వనుంది. 
 
ఇదిలా వుండగా, సలార్‌ సినిమాలో ప్రభాస్‌ రెండు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయట. ఇందులో ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. బాహుబలి తరహాలో ఈ సినిమా కూడా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం మెండుగా వుంది. ఇందులో జగపతిబాబు, పృథ్వీరాజ్‌ కుమార్‌ ఇద్దరు విలన్లుగా నటిస్తున్నారు. యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు సంగీతం ప్రధాన్యత చాలా వుందని తెలుస్తుంది. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా విజువల్‌ వండర్‌తోపాటు గ్రాఫిక్స్‌ ప్రధానంగా వుండేలా చర్యలు తీసుకుంటున్నాడని టాక్‌.