గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 మార్చి 2023 (11:52 IST)

'మిస్టర్ కె' షూటింగులో గాయపడిన అమితాబ్ .. ముంబై నివాసంలో విశ్రాంతి

amitabh
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ షుటింగులో గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఒక చిత్రం షూటింగులో ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ముంబైకు వెళ్లి తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా "మిస్టర్ కె" పేరుతో ఓ భారీ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. 
 
హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంది. ఇక్కడ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో అమితాబ్ ప్రమాదానికు గురయ్యారు. ప్రమాదంలో ఆయన పక్కటెముక మృదులాస్థి విరిగిందని, కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగులో రాసుకొచ్చారు.
 
ఈ ప్రమాదంలో తాను గాయపడటంతో షూటింగును రద్దు చేశారని వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదం నాలుగు రోజుల క్రితం జరిగింది. ఈ విషయాన్ని అమితాబ్ స్వయంగా తన బ్లాగులో రాసేంత వరకు ఏ ఒక్కరికీ తెలియదు. ప్రస్తుతం ఆయన ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఆయన కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.