హైదరాబాద్‌లో అమితాబ్ బచ్చన్ గాయాలు..
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు హైదరాబాదులో గాయాలైనాయి. హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ కె షూటింగ్‌లో, ఒక యాక్షన్ షాట్ సమయంలో అమితాబ్‌కు గాయం ఏర్పడింది.
పక్కటెముక మృదులాస్థి విరిగిందని వైద్యులు చెప్తున్నారు. కుడి పక్కటెముకకు కండరాలకు దెబ్బ తగిలింది. దీంతో షూటింగ్‌ను రద్దు చేశారు.
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో అమితాబ్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయనకు సీటీ స్కాన్ చేయడం జరిగిందని.. ఇంటికి తిరిగి వచ్చినట్లు అమితాబ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
రామోజీ ఫిలిం సిటీలో ప్రాజెక్ట్ కె షూటింగ్ సందర్భంగా ఈ ఘటన జరిగిందని సినీ యూనిట్ వర్గాల సమాచారం.