శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (09:03 IST)

ఖుషీ ఖుషీగా సమంత.. ఆటో ఎక్కి ఎక్కడికెళ్తుందో..?

టాలీవుడ్ అందాల నటి సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సమంత.. తాజాగా అభిమన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్, సమంత కలిసి తమిళంలో నటించిన ''ఇర

టాలీవుడ్ అందాల నటి సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సమంత.. తాజాగా అభిమన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్, సమంత కలిసి తమిళంలో నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా హిట్ చిత్రంగా నిలిచింది.


ఈ సినిమా తెలుగులో ''అభిమన్యుడు'' పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని నెలాఖరున విడుదల చేయనున్నారు. సైబర్ నేరాల చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు.
 
మరోవైపు రంగస్థలం, మహానటి వరుస విజయాలతో ఖుషీఖుషీగా వున్న సమంత.. తన తదుపరి సినిమా అయిన ''యూ టర్న్'' షూటింగులో పాల్గొంటోంది. ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాకు రీమేక్. అదే పేరుతో పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌కి సంబంధించిన ఈ సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్‌లో భాగంగా సమంత ఆటో ఎక్కిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భూమిక కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.