ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (19:44 IST)

ఉదయ్ కిరణ్ కోటీశ్వరుడు.. భార్య విషితపైనే అనుమానం.. శ్రీదేవి

Uday kiran
ఉదయ్ కిరణ్ మరణంపై ఆయన సోదరి శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన తమ్ముడు కోటీశ్వరుడని.. అమ్మగారు తమకు భారీ ఆస్తులిచ్చారని.. అలాంటి పరిస్థితుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులతో డబ్బుల్లేక చనిపోవాల్సిన ఖర్మ ఉదయ్‌కి పట్టలేదని శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనానికి దారితీసింది. ఇంకా ఉదయ్ కిరణ్ భార్య విషితపై ఆమె అనుమానాలు వ్యక్తం చేసింది. 
 
సినిమాలు ఉన్నా లేకపోయినా కూడా తన తమ్ముడు ఎప్పుడూ కోటీశ్వరుడే.. వాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని శ్రీదేవి కొట్టిపారేసింది. అమ్మ తమ్ముడికి నాలుగు కేజీల బంగారంతో పాటు వంద కేజీల వెండి.. అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో మూడు ఆస్తులు కూడా ఇచ్చినట్లు చెప్పింది. 
 
ఆ ఆస్తులన్నీ ఉదయ్ పేరు మీదే ఉన్నాయని.. అలాంటప్పుడు తన తమ్ముడు డబ్బులేని వాడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఉదయ్ కిరణ్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్పింది. ఉదయ్ కిరణ్ మరణంపై అనుమానాలున్నాయంటూ చాలా కాలంగా ఈమె చెబుతూనే ఉంది. కానీ ఆత్మహత్య అంటూ దాన్ని ఎవరూ ముందుకు తీసుకురాలేదు.
 
ఉదయ్ చనిపోయిన తర్వాత తన ఆస్తులు కూడా మొత్తం అతడి భార్య విషిత తీసుకుందని.. కనీసం తమ కుటుంబంతో కలిసే ప్రయత్నం కానీ.. దగ్గరయ్యే ప్రయత్నం కానీ చేయలేదని శ్రీదేవి సంచలన వ్యాఖ్యలు చేసింది. విషిత ప్రవర్తనతో తమకు మాకు అనుమానాలు వస్తున్నాయని.. ఉదయ్ మరణం విషయంలో కూడా తమకు చాలా అనుమానాలు ఉన్నాయంటూ శ్రీదేవి తెలిపింది.