సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2017 (10:28 IST)

బోరున విలపిస్తూ మమ్మూట్టి ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన నటి... ఎందుకు?

మలయాళ నటి అన్నా రాజన్ బోరున విలపించింది. అదీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ముందు. తాను ఎలాంటి తప్పు చేయలేదనీ, కానీ, మమ్మూట్టి ఫ్యాన్స్ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారని పేర్కొంది.

మలయాళ నటి అన్నా రాజన్ బోరున విలపించింది. అదీ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ముందు. తాను ఎలాంటి తప్పు చేయలేదనీ, కానీ, మమ్మూట్టి ఫ్యాన్స్ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారని పేర్కొంది. నిజానికి మాలీవుడ్‌ మెగాస్టార్‌ మమ్మూట్టి. ఆయన్ను ఉద్దేశించి ఓ టీవీ షోలో అన్నా రాజన్ వ్యంగ్య కామెంట్స్ చేసింది. దీంతో స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఆమెను ట్రోల్‌ చేయగా, కన్నీటితో సారీ చెబుతూ ఫేస్‌బుక్‌లో వీడియో సందేశాన్ని అందించింది. 
 
మమ్మూట్టి, ఆయన తనయుడు సల్మాన్‌ దుల్కర్‌లలో అవకాశం వస్తే ఎవరికి జోడీగా నటిస్తారని ఓ టీవీ షో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్‌ను యాంకర్‌ ప్రశ్నించింది. దీనికి సమాధానంగా దుల్కర్‌తో నటించాల్సి వస్తే అందులో మమ్మూట్టి తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు వెటకారంగా సమాధానమిచ్చింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మమ్మూట్టి ఫ్యాన్స్‌.. ఆమె తండ్రిని సైతం వదలకుండా ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లలో తీవ్ర పోస్టులు పెట్టేశారు. దీంతో దిగొచ్చిన అన్నా ఎట్టకేలకు క్షమాపణలు చెప్పింది. 
 
'మమ్మూట్టి సర్‌ను కించపరిచేలా నేను మాట్లాడలేదు. ఎలాంటి కామెంట్స్ చేయలేదు. దుల్కర్‌కు జోడీగా నటించాల్సి వస్తే అందులో మమ్మూట్టి.. దుల్కర్‌కు తండ్రిగా నటించాలని కోరుకుంటున్నట్లు, మమ్మూట్టితో కూడా జోడీగా నటించుకుంటున్నట్లు నేను చెప్పాను. కానీ, ఆ ప్రోగ్రాం నిర్వాహకులు టీఆర్పీ కోసం మొదటి సగం వరకే చూపించారు. ఫలితం నాపై తీవ్ర స్థాయిలో పడింది. అంతా ఇష్టం వచ్చినట్లు తిట్టారు. వారిద్దరినీ నేను అవమానించేలా మాట్లాడలేదు. క్షమించండి' అని వీడియోలో కోరింది.