శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (18:52 IST)

వైష్ణవ్ తేజ్ "'ఉప్పెన'' ఫస్ట్ లుక్ అదిరిందిగా..!

మెగా కుటుంబం నుంచి మరో హీరో వచ్చేశాడు. హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా తెలుగుతెరకి పరిచయమవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ గురువారం విడుదలైంది. ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్‌కు జంటగా కృతి శెట్టి నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తుండగా, సంగీతం దేవీశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. 
 
ఏప్రిల్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రీలుక్‌లో చేపలు పట్టే కుర్రాడి గెటప్‌లో కనిపించాడు వైష్ణవ్‌. తాజాగా విడుదలైన లుక్‌లో వైష్ణవ్ కడలి అలలు తనను తాకేలా ఫోజిస్తూ నిలబడ్డాడు. ఈ లుక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.