Daily Horoscope
✕

‘నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె..’ - వాల్మీకి టీజ‌ర్ సెన్సేష‌న్

Written By శ్రీ
Updated: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:13 IST)
మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా మాస్‌ కమర్షియల్‌ సినిమాల దర్శకుడు హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్‌ మూవీ వాల్మీకి. ఇటీవల తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన జిగర్తాండ అనే సినిమాకు అఫీషియల్‌ రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా ప్రీ లుక్‌ టీజర్‌ ఇప్పటికే యూట్యూబ్‌లో రిలీజయి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్‌ని సంపాదించింది. 
 
ఇక ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ టీజర్‌‌ను స్వతంత్ర దినోత్సవ కానుకగా ఆగష్టు 15న రిలీజ్‌ అయ్యింది. ‘నా సినిమాలో విలనే నా హీరో’ అంటూ అధర్వ చెప్పే డైలాగ్‌తో టీజర్‌ స్టార్ట్‌ అవుతుంది. వరుణ్‌ స్టైలిష్‌ లుక్‌తో గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తున్నాడు. సిగరెట్‌ తాగుతూ వరుణ్‌ నడుస్తూ వచ్చే సీన్‌ బాగుంది. టీజర్‌ చూస్తుంటే యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలువనున్నాయని తెలుస్తుంది. 
 
‘అందుకే పెద్దోళ్ళు చెప్పిండ్రు.. నాలుగు బుల్లెట్స్‌ సంపాయిత్తే రెండు కాల్చుకోవాలె, రెండు దాచుకోవాలె’ అని వరుణ్‌ తేజ్‌ ఇంటెన్స్‌ లుక్‌ చెప్పే డైలాగ్‌తో 51 సెకండ్ల నిడివిగల టీజర్‌ ముగుస్తుంది. టీజర్‌ చూస్తుంటే సినిమా ఎప్పుడు రిలీజ్‌ అవుతుందా అనే ఇంట్రెస్ట్‌ క్రేయేట్‌ చేశారు దర్శకుడు హరీష్‌ శంకర్‌. 
 
వరుణ్‌ ఫస్ట్‌ మూవీ ముకుందలో హీరోయిన్‌‌గా నటించిన పూజ హెగ్డే, మరొక్కసారి ఈ సినిమాలో ఆయనతో నటిస్తోంది. యువ సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వరుణ్‌ ఒక డిఫరెంట్‌ క్యారెక్టర్లో నటిస్తున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, సెప్టెంబర్‌ 13న వరల్డ్‌‌వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నారు.

అన్నీ చూడండి

అనిరుధ్-కావ్య మారన్ రిసెప్షన్‌కు హాజరైన మంత్రి నారా లోకేష్ కుటుంబం

అనిరుధ్-కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్లో విజయ్-రజినీకాంత్-స్టాలిన్

హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభోత్సవ రోజునే రూ.800 కోట్ల అమ్మకాలు సాధించిన ఏఎస్‌బీఎల్‌ లెగసీ

హైదరాబాద్ నగరానికి అప్పుడేమో మెస్సీ.. ఇప్పుడు రొనాల్డో.. రేవంత్ రెడ్డి

పరివర్తన రాజనీతి పార్టీకి ప్రధాన కార్యదర్శిగా నందమూరి కోడలు అలేఖ్య

అన్నీ చూడండి

శ్వాసకోశ సమస్యలను అరికట్టే మూలికలు, ఏంటవి?

డాక్టర్ శ్రీవర్మ'స్ వెల్నెస్‌కు పాలీహెర్బల్ యాంటీ డయాబెటిక్ ఫార్ములా : ఎస్ఆర్ఎంటీ వెల్లడి

సిమ్స్ ఆస్పత్రిలో ఆసియాలోనే తొలిసారి : పదేళ్ల బాలుడికి కృత్రిమ అవయవంతో ప్రొస్థెటిక్ గ్రాఫ్ట్

చెన్నై కావేరీ ఆస్పత్రిలో రికార్డు స్థాయిలో హైపెక్ కీమోథెరపీ చికిత్సలు

మనం తాగుతున్న పాలు, పెరుగు, పన్నీర్ ఆరోగ్యానికి ఏం చేస్తున్నాయి?

తర్వాతి కథనం
Show comments