ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:39 IST)

వర్ష బొల్లమ్మకు పెళ్లి.. నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసి, అబ్బాయిని?

Varsha Bollamma
యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ ట్రోలర్‌కు చెక్ పెట్టింది. వర్ష బొల్లమ్మ పెళ్లికి సిద్ధమైందంటూ వార్తలు వచ్చాయి. ఒక స్టార్ ప్రొడ్యూసర్ కొడుకుని వర్ష బొల్లమ్మ ప్రేమించారట. అతన్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారట. ఇరు కుటుంబాల పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. 
 
ఈ కథనాలపై వర్ష బొల్లమ్మ నేరుగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తన సమాధానం తెలియజేశారు. మీడియా కథనాలను ఉద్దేశిస్తూ సెటైరికల్ కామెంట్ చేశారు.
 
"నా కోసం నాకు తెలియకుండా పెళ్లి చూపులు చూసి, అబ్బాయిని ఎంపిక చేసి పెళ్లి నిర్ణయించారు. ఆ అబ్బాయి ఎవరో నాకు కూడా చెప్పండి. ఎందుకంటే మా పేరెంట్స్‌తో చెప్పాలి. ప్రస్తుతానికి నా పెళ్లి చూపులు చూడాలంటే ఆహాలో స్వాతి ముత్యం మూవీ చూడండి" అంటూ కామెంట్ పోస్ట్ చేశారు.