గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (21:58 IST)

స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కానున్న జియో ఫైనాన్సియల్ సర్వీసెస్

Ambani
Ambani
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి చెందిన మరో కంపెనీ మార్కెట్‌లో లిస్ట్ కానుంది. ఇందులో భాగంగా జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థను తొలుత విడి కంపెనీగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తున్నారు. 
 
రిలయన్స్ ఇండస్ట్రీస్ తన ఫైనాన్స్ సేవల సంస్థ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ (RSIL)ను మెయిన్ కంపెనీ నుంచి విడదీయాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. 
 
దాని పేరును జియో ఫైనాన్స్ సర్వీసెస్ లిమిటెడ్ (జెఎఫ్‌ఎస్ఎల్)గా పేరు మార్చుతున్నట్లు ప్రకటించింది. ఇది కూడా భారత స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అవుతుందని రిలయన్స్ గ్రూప్ స్పష్టం చేసింది.