శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 జూన్ 2023 (18:15 IST)

లావణ్యతో హాయిగా అలా షికారు చేసిన వరుణ్ తేజ్.. పిక్ వైరల్

Varun Tej, Lavanya Tripathi
Varun Tej, Lavanya Tripathi
టాలీవుడ్ స్టార్స్ ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల తార లావణ్య త్రిపాఠిల ఎంగేజ్‌మెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
ఇలాంటి పరిస్థితుల్లో వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఓ కూల్ పిక్‌ను షేర్ చేసుకున్నాడు. లావణ్యతో కలిసి విదేశాల్లో విహరిస్తు్న వరుణ్ తేజ్‌ను ఆ ఫోటోల్లో చూడొచ్చు. 
 
ఈ ఇన్‌స్టా పోస్టులో వరుణ్ స్పందిస్తూ.. హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకుడు. 
 
పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలోనూ వరుణ్ తేజ్ ప్రాజెక్టు చేస్తున్నాడు. ఉత్తరాది బ్యూటీ లావణ్య త్రిపాఠి ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.