Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

గ్రాఫిక్స్ కి ప్రాధాన్య‌త ఉన్న వీరఖడ్గం

Written By డీవీ
Updated: శనివారం, 4 మార్చి 2023 (17:00 IST)
Srishti Dange
ఎం ఏ చౌదరి దర్శకత్వంలో, కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం "వీరఖడ్గం`. మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూస‌ర్‌. సృష్టి డాంగే హీరోయిన్‌.  ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని మార్చి మూడో వారంలో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోన్న సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఎమ్ఏ చౌద‌రి మాట్లాడుతూ...`` చరిత్ర శిథలమైనా, దాని మూలాలు ఎక్కడో ఒక చోట మిగిలే ఉంటాయి...పగ కూడా అంతే.  ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా  సరే దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది, వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ.... వీరఖడ్గం.
 
 గ్రాఫిక్స్ కి  ప్రాధాన్య‌త ఉన్న చిత్ర‌మిది. నిర్మాత  కోటేశ్వ‌ర‌రావు , లైన్ ప్రొడ్యూస‌ర్ సునీల్ కుమార్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించారు. షాయ‌క్ ప‌ర్వేజ్ మంచి సంగీతాన్ని స‌మ‌కూర్చాడు. మార్చి మూడో వారంలో సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.
 
 లైన్ ప్రొడ్యూస‌ర్ మారుశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ...``నిర్మాతగా నేను గ‌తంలో `రెండో కృష్ణుడు` అనే సినిమా తీశాను. ఆ త‌ర్వాత ఎమ్ఏ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `ఇంద్రాణి, చిలిపికృష్ణుడు చిత్రాల‌కు ఫైనాన్సియ‌ర్ గా చేశాను. క‌థ న‌చ్చి `వీర‌ఖ‌డ్గం` చిత్రానికి లైన్ ప్రొడ్యూస‌ర్ గా చేశాను. సినిమా చాలా బాగా వ‌చ్చింది. ప్రేక్ష‌కులు మాచిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్ర‌స‌న్న కుమార్ మాట్లాడుతూ...``ద‌ర్శ‌కుడు ఎమ్ ఏ చౌద‌రి ప్ర‌తిభావంతుడు. చాలా కాలంగా తెలుసు. పాట‌లు బావున్నాయి. ఈ సినిమా విజ‌య‌వంత‌మై ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.
 
తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ...``సినిమా చూశాను. మంచి గ్రాఫిక్స్ తో చాలా గ్రాండ్ గా తీశారు. పాట‌లు కూడా బావున్నాయి. లొకేష‌న్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద స‌క్సెస్ సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు మంచి పేరు తీసుక‌రావాల‌న్నారు.
 
సంగీత ద‌ర్శ‌కుడు షాయ‌క్ ప‌ర్వేజ్ మాట్లాడుతూ, ఇందులో నాలుగు పాట‌లున్నాయి.  సునీత , లలిత సాగ‌రి, సాహితి, రామ‌కృష్ణ పాట‌లు పాడారు. ద‌ర్శ‌కుడు చౌద‌రి గారు నాతో క్వాలిటీ వ‌ర్క్ చేయించుకున్నారు. 300 ఏళ్ల క్రితం పార్వ‌తిపురంలో జ‌రిగిన  ఓ య‌థార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మ్యూజిక్ కి స్కోపున్న సినిమా అన్నారు.

అన్నీ చూడండి

విస్తరించిన ఉపరితల ద్రోణి : వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో వర్షాలు

'దృశ్యం' సినిమా చూసి 2 వేల కిమీ ప్రయాణించి తండ్రిని గొడ్డలితో నరికేసిన తనయుడు

వయోవృద్ధులకు కూడా ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు బీభత్సం - మావటిపై దాడి

చావంటే భయంలేదు.. ఫ్లైట్‌ను కూల్చివేయాలన్నదే ప్లాన్ : ఫ్లైదుబాయ్ కో కెప్టెన్ వాంగ్మూలం

అన్నీ చూడండి

LDL కొలెస్ట్రాల్‌పై 5 సాధారణ అపోహలు- వాస్తవాలు: ఆరోగ్యంగా ఉన్నట్లనిపించడం అంటే గుండె కూడా సురక్షితంగా ఉందని కాదు

టైప్ 2 డయాబెటిస్ వ్యాధి అదుపు చేసే మార్గాలు

గుండె అత్యవసర పరిస్థితులపై సన్నద్ధతను బలోపేతం చేస్తున్న సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్

bad cholesterol, చెడు కొవ్వు కరిగించే పదార్థాలు

వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్‌నెస్

తర్వాతి కథనం
Show comments