ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (17:08 IST)

సంక్రాంతి అల్లుడు.. త్వరలో ''వెంకీ మామ'' కానున్నాడు.. ఎలా?

ఎఫ్‌-2తో సంక్రాంతి అల్లుడైన విక్టరీ వెంకటేష్ తన ఇంటికి అల్లుడిని తెచ్చుకోనున్నారు. వెంకీ కుమార్తె ఆశ్రిత వివాహానికి ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్‌తో మార్చి ఒకటో తేదీన ఆశ్రిత వివాహం అట్టహాసంగా జరుగనుంది. 
 
హైదరాబాదులో జరిగే ఈ వివాహ వేడుకకు భారీ ఎత్తుల సెలెబ్రెటీలు హాజరుకానున్నారు. వివాహ వేడుకకు అనంతరం రామానాయుడు స్టూడియోస్‌లో విందు ఏర్పాటు చేయనున్నారు.
 
కాగా ఇప్పటికే ఈ నెల ఆరో తేదీన ఆశ్రిత నిశ్చితార్థం జరిగింది. ఆశ్రిత ప్రేమ వివాహం చేసుకోబోతుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఇంకా పెళ్లి పనుల్లో వెంకీ బిజీ బిజీగా వున్నారని.. ఈ పెళ్లి పూర్తయ్యాక వెంకీ మామ షూటింగ్‌లో విక్టరీ వెంకీ పాల్గొంటారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది.