ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (18:39 IST)

ఐదు భాషల్లో 21న వర్మ -వీడు తేడా

Natti Kranti, Muskan
నట్టిక్రాంతి హీరోగా ఐదు భాషల్లో రూపొందిన చిత్రం "వర్మ'' (వీడు తేడా). ఇందులో నట్టి క్రాంతి సరసన హీరోయిన్లుగా ముస్కాన్ ,సుపూర్ణ మలాకర్, సందడి చేస్తున్నారు. నట్టికుమార్ దర్శకత్వం వహించారు. క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ అండ్ నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై శ్రీమతి నట్టి లక్ష్మి,, శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నిర్మాత నట్టి కరుణ నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషలలో రూపొందించిన  ఈ చిత్రాన్ని జనవరి 21న భారీగా విడుదల చేయనున్నట్లు నిర్మాత నట్టి కరుణ తెలిపారు.

తొలుత ఈ చిత్రానికి  'సైకో వర్మ" అనే టైటిల్ పెట్టాం. కానీ సైకో అనే పదానికి సెన్సార్ అభ్యంతరం వ్యక్తంచేయడంతో ఆ పదాన్ని టైటిల్ లో తీసివేశామని  నిర్మాత నట్టి కరుణ వివరించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ సాంగ్, థీమ్ మ్యూజిక్ లకు, అలాగే మోషన్  పోస్టర్లకు విశేషమైన స్పందన లభించిందని కరుణ తెలిపారు. కాగా ఈ చిత్రానికి సంబందించిన ``మనసే పిచ్చిది అయినదే ...'' అనే లిరికల్ వీడియో సాంగ్ శుక్రవారం మధ్యాహ్నం 12-20 గంటలకు ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదల కానున్నట్లు నిర్మాత తెలిపారు.
 
దర్శకుడు నట్టి కుమార్  మాట్లాడుతూ, ఓ సాఫ్ట్ వేర్ కుర్రాడి జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ చిత్ర కథ సాగుతూ...యదార్థ సంఘటనల ప్రేరణతో సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. హీరో నట్టి క్రాంతి తన పాత్రకు ప్రాణం పోశాడని, పాటలు కూడా అలరిస్తాయని చెప్పారు. చిత్రం అన్నివిధాలుగా చాలాబాగా వచ్చిందని    అన్నారు.
హీరో నట్టి క్రాంతి మాట్లాడుతూ, సమాజంలో నేడు జరిగిన, జరుగుతున్న వాస్తవిక సంఘటనల సమాహారమే ఈ చిత్రమని అన్నారు. చక్కటి నటనను కనబరిచేందుకు కావాల్సిన అన్ని ఎమోషన్స్ తన పాత్రలో ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో చమక్ చంద్ర, కేదార్ శంకర్ తదితరులు తారాగణం.
ఈ చిత్రానికి సంగీతం: రవిశంకర్, సినిమాటోగ్రఫీ: జనార్దన్ నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: కె.వి.రమణ, ఫైట్స్: వింగ్ చున్ అంజి,  నిర్మాత: నట్టి కరుణ, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: నట్టికుమార్.