శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 24 జనవరి 2019 (16:34 IST)

'ఖైదీ' కోసం ఆ నలుగురు హీరోయిన్లు.. ఛాన్స్ ఎవరికిదక్కేనో?

కోట్లాది మంది సినీ ప్రేక్షకుల గుండెల్లో ఖైదీలా ఉన్న హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయన తొమ్మిదేళ్ళ విరామం తర్వాత నటించిన చిత్రం "ఖైదీ నంబర్ 150". ప్రస్తుతం "సైరా నరసింహా రెడ్డి" అనే చిత్రంలో నటిస్తుండగా, ఈ చిత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఈ చిత్రం తర్వాత మరో చిత్రంలో నటించేందుకు ఆయన సమ్మతించారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రం సామాజిక నేపథ్యంతో కూడుకున్నది. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి కాగా, ప్రీ ప్రొడ‌క్షన్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుపుతున్న‌ాయి. 
 
ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన నటించేందుకు నలుగురు భామల పేర్లను పరిశీలిస్తున్నారు. ఈ నలుగురు హీరోయిన్లలో బాలీవుడ్ భామ విద్యాబాలన్, టాలీవుడ్ హీరోయిన్లు త్రిషా, తమన్నా, నయనతారలు ఉన్నారు. 
 
అయితే, ప్రస్తుతం 'సైరా' చిత్రంలో చిరంజీవితో కలిసి నయనతార నటిస్తోంది. అలాగే, తమన్నా కూడా చిన్నపాటి పాత్రను పోషిస్తోంది. ఇకపోతే, 'స్టాలిన్' చిత్రంలో చిరుతో కలిసి త్రిష స్టెప్పులేసింది. ఈ పరిస్థితుల్లో కొత్తద‌నం కోసం విద్యాబాల‌న్‌నే ఎంపిక చేయవచ్చనే టాక్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.