ఇటుక గట్టిదా?.. కోడిగుడ్డు గట్టిదా? ఈ వీడియో చూడండి!
ప్రస్తుతం పలు రకాల సోషల్ మీడియాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా, ఫేస్‌బుక్, ట్విట్టర్, టిక్ టాక్, హెలో, షేర్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా అందుబాటులో ఉన్న సోషల్ మీడియా యాప్‌లు ఉన్నాయి. వీటి పుణ్యమాని అనేకమంది తమలో ఉన్న ప్రతిభను బయటకు తీస్తున్నారు. తమలోని టాలెంట్‌కు సంబంధించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి.
తాజాగా బాలీవుడ్ నటుడు ఒకరు ఇటుక గట్టిదా? కోడిగుడ్డు గట్టిదా? అంటూ ప్రశ్నించాడు. పైగా, ఇటుక కంటే గుడ్డే గట్టిదని నిరూపించాడు. తన చేతి గుప్పెట కోడిగుడ్డును పెట్టుకుని ఇటుకలను పగులగొట్టి ఔరా అనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ నటుడు పేరు విద్యుత్ జమ్వాల్. అతను చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియోను చూసిన వారంతా గుడ్డుబలం తెలుసుకుని తెగ ఆశ్చర్యపోతున్నారు. తన చేతి గుప్పెట్లో ఒక గుడ్డు ఉంచుకుని ఇటుకను పగులగొట్టాడు. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ ఫీట్‌లో ఇటుక పగిలినా గుడ్డు మాత్రం నిక్షేపంగా ఉండటం గమనార్హం.