యమ్మీ టేస్ట్ చాక్లెట్‌తో మాస్క్ ఇలా..?

Last Updated: గురువారం, 6 జూన్ 2019 (14:50 IST)
చాక్లెట్స్‌ అంటే అందరికీ చాలా ఇష్టం. అలాంటి చాక్లెట్‌తో చర్మానికి మేలు చేసే చాక్లెట్ మాస్క్ ఎలా వేసుకోవాలో చూద్దాం.. చాక్లెట్‌లో యాంటీ-యాక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మానికి తేమనిస్తాయి. విటమిన్లు కూడా చర్మానికి అందించడంలో చాక్లెట్స్ బాగా పనిచేస్తాయి. 
 
అందుకోసం డార్క్ చాక్లెట్‌ను షాపు నుంచి కొనితెచ్చుకుని.. దాన్ని పాత్రలో వుంచి కాసింత వేడి చేయాలి. అలా మెల్ట్ అయిన ఒక స్పూన్ చాక్లెట్‌కు, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, కోడిగుడ్డులోని తెల్లసొన చేర్చి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల తర్వాత మాస్క్‌ను తొలగించుకోవాలి. కోమలమైన, మృదువైన చర్మం కోసం ఈ చాక్లెట్ మాస్క్‌ను మాసానికి ఓసారి ట్రై చేయొచ్చు.దీనిపై మరింత చదవండి :