శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (16:59 IST)

పనస గింజల్ని ఇలా కూడా వాడుకోవచ్చు..

పనసతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. పనస పండులోని సి విటమిన్‌ శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, ఫ్లూను అడ్డుకుంటుంది. పనసలోని కొవ్వులు పెద్దపేగులోని విషపదార్థాలను తొలగిస్తాయి. పెద్దపేగు కేన్సర్‌ నుంచి కాపాడుతాయి. ఎముకల దృఢత్వానికి అవసరమైన కాల్షియం వీటిల్లో లభిస్తుంది. 
 
ఆస్టియోపోరోసిస్‌ ముప్పును తగ్గిస్తుంది. ఆస్తమాతో బాధపడేవారు పనసపండు తింటే ప్రయోజనం ఉంటుంది. వీటి గింజల్లోని పొటాషియం, రక్తంలోని సోడియం నిల్వల్ని నియంత్రిస్తుంది. అధిక, అల్ప రక్తపీడనం, గుండెపోటు వచ్చే ముప్పును నివారిస్తుంది.
 
పనస ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. ఎలాగంటే ఎండిన పనస గింజల్ని పాలు, తేనెలో నానబెట్టి, మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకుంటే చర్మం కోమలంగా తయారవుతుంది.