సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 4 జూన్ 2019 (13:30 IST)

కొబ్బరినూనెను ఎలా రాసుకోవాలి.. ఆలివ్ ఆయిల్ పిల్లలకు?

కొబ్బరినూనెను అలానే కాకుండా వేడిచేసిన తర్వాత రాసుకుంటే మంచి ఫలితం వుంటుంది. కొబ్బరినూనె శిరోజాలను పటిష్ఠంగా, మెరిసేలా చేస్తుంది. వేడిచేసిన కొబ్బరి నూనెను జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. దీంతో దెబ్బతిన్న కురులను పునరుద్దరిస్తుంది. 
 

వెంట్రుకలు కొసల భాగంలో చిట్లిపోకుండా చూస్తుంది. అలాగే బాదం నూనె మసాజ్ ఆయిల్‌గా బాగా ఉపయోగపడుతుంది. ఈ నూనెను రాసుకోవడం ద్వారా చర్మ వ్యాధులను దూరం చేసుకోవచ్చు. 
 
ఆలివ్ ఆయిల్‌ పసిపిల్లల చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వారి చర్మాన్ని మరింత మృదువుగా మార్చుతుంది. పొడిచర్మానికి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. చుండ్రు, ఆయిలీ జుట్టు ఉన్నవారు ఆలివ్‌నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది. 
 
నువ్వుల నూనె చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. తొందరగా పీల్చుకుంటుంది. అంతేకాదు బాడీ మసాజ్‌గా ఉపయోగపడుతుంది. చర్మాన్ని కోమలంగా ఉంచుతుంది. సన్‌స్ర్కీన్‌ లోషన్‌గానూ పనిచేస్తుంది. ముఖాన్ని తేమగా, తాజాగా కనిపించేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.