బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 1 జూన్ 2019 (14:22 IST)

నవ్యాంధ్రలో కొనసాగుతున్న రాజీనామాల పర్వం...

నవ్యాంధ్రలో అధికార మార్పిడి జరిగింది. దీంతో టీడీపీ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పదవుల్లో నియమితులైన వారందరూ తమతమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయనున్నట్టు ప్రకటించారు. దీంతో అనేకమంది వైకాపా సర్కారు తొలగించకముందే స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నారు.
 
ఇలాంటి వారిలో ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మొదటగా ఉన్నారు. ఈయన తితిదే పాలక ధర్మకర్తల మండలి సభ్యుడుగా ఉన్నారు. అలాగే శ్రీవేంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్.వి.బి.సి) ఛైర్మన్‌గా ఉన్నారు. ఈయన తన పదవికి రాజీనామా చేశారు.
 
ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర, నాటక మండలి అభివృద్ధికి సంస్థ (ఎఫ్.డి.సి) ఛైర్మన్‌గా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త అంబికా కృష్ణ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 
 
ఇకపోతే శనివారం వక్ఫ్ బోర్డు ఛైర్మన్ పదవికి మాజీ ఎమ్మెల్యే జలీల్ బాషా రాజీనామా చేయగా, ఆంధ్రప్రదేశ్ బ్రహాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గిరి నుంచి వేమూరి ఆనంద రాము తప్పుకున్నారు. అలాగే జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రి ఛైర్మన్ పదవి నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ కుమారుడు స్వచ్ఛంధంగా తప్పుకున్నారు.