గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 28 మే 2019 (13:30 IST)

సిలిండర్ పేలి ఎమ్మెల్యేకు గాయాలు... ఎక్కడ?

బీహార్ రాష్ట్రంలోని తారాపూర్ ఎమ్మెల్యే ఇంటిలో సిలిండర్ పేలింది. ఈ పేలుడులో సిట్టింగ్ ఎమ్మెల్యే మేవాలాల్ చౌదరితో పాటు ఆయన భార్య నీతా చౌదరి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈమె కూడా మాజీ ఎమ్మెల్యే కావడం గమనార్హం. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గాయపడ్డారు. దీంతో వీరిని హుటాహుటిన భగల్‌పూర్ ఆస్పత్రికి తరలించారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు... ఈ పేలుడు సిలిండర్ పేలడం వల్లే సంభవించినట్టు వెల్లడించారు. అలాగే, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి.