గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 16 జులై 2022 (15:58 IST)

క్యూరియాసిటీ పెంచుతున్న విజయ్ ఆంటోనీ హత్య మోషన్ పోస్టర్

Vijay Antony
Vijay Antony
తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య'. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. 
 
ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. లీలను ఎవరు హత్య చేశారు అనే కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుండటం ఈ వీడియోలో చూపించారు. విచారణ జరిపే సీటులో భాయ్ ఫ్రెండ్, ఫొటోగ్రాఫర్, మేనేజర్, ఏజెంట్, పొరుగు మహిళ...వీరిలో ఎవరు. వీరెవరూ కాకుండా లీల హత్యకు మరెవరైనా కారణమా అనే ప్రశ్నలతో మోషన్ పోస్టర్ ఆకట్టుకుంది. ఎవరూ ఊహించని వ్యక్తి (విజయ్ ఆంటోనీ)కి లీలను చంపాడా అనేది ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి మిస్టరీ తేలనుంది. 
 
ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.