శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (17:30 IST)

వంద లక్కీ ఫ్యామిలీస్‌కు లక్ష చొప్పున చెక్స్: హీరో విజయ్ దేవరకొండ

vijay and families
vijay and families
"ఖుషి" సినిమాకు ఘన విజయాన్ని అందించిన అభిమానులతో తన సంతోషాన్ని పంచుకుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఖుషి హ్యాపీనెస్ షేర్ చేసేందుకు ఎంపిక చేసిన 100 లక్కీ ఫ్యామిలీస్ కు లక్ష రూపాయల చొప్పున చెక్స్ అందించారు. ఈ చెక్స్ అందుకుంటున్న ఫ్యామిలీస్ ఉద్వేగానికి లోనై విజయ్ ను హగ్ చేసుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు శివ నిర్వాణ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ పాల్గొన్నారు.
 
kushi families
kushi families
ఈ సందర్భంగా నిర్మాత వై రవిశంకర్ మాట్లాడుతూ - ఖుషి సినిమా సక్సెస్ మా అందరికీ ఎంత ఖుషిని పంచిందో మీకు తెలుసు. మీ అందరి ఆదరణ వల్లే సినిమా ఇంత సక్సెస్ అయ్యింది. మా సంతోషాన్ని మీతో కూడా పంచుకునేందుకు విజయ్ గారు ఈ ఇనిషేటివ్ తీసుకోవడం హ్యాపీగా ఉంది. ఆడియెన్స్, అభిమానులు ఇచ్చిన ప్రేమ వల్లే మా సంస్థ ఇంత మంచి పొజిషన్ లో ఉంది. వారికి తిరిగి ఇవ్వడం అనే గుడ్ కాన్సెప్ట్ విజయ్ తీసుకురావడం బాగుంది. ఇండస్ట్రీలోని మిగతా వారు కూడా ఇలాంటి అడుగు వేస్తారని ఆశిస్తున్నాను. అన్నారు.
 
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ - మా ఖుషి సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ దాటి సూపర్ హిట్ అయ్యింది. ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ కు థాంక్స్ చెబుతున్నాం. 100 మందికి హెల్ప్ చేయాలనే ప్రయత్నం మా మూవీతో విజయ్ స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి మంచి పనులు చేసేందుకు అందరినీ ఎంకరేజ్ చేసే స్టెప్ ఇది. అన్నారు.
 
దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - విజయ్ తో నేను ట్రావెల్ చేసిన ఈ రెండేళ్లలో ఫ్యాన్స్ ఆయన మీద చూపించిన ప్రేమలో కొంత నాపైనా చూపించారు. ఖుషిని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అభిమానులకు థాంక్స్. మీలో 100మందికి మా లవ్ షేర్ చేయాలనే ప్రయత్నం నా సినిమా ద్వారా విజయ్ మొదలుపెట్టడం హ్యాపీగా ఉంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, సౌత్ స్టేట్స్ నుంచి సెలెక్ట్ చేశారు. ఎందుకంటే మా మూవీకి సౌత్ లో అన్ని ప్లేసెస్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ నుంచి నేను ఇన్స్ పైర్ అయిన విషయం ఒకటుంది. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా విజయ్ ఒకేలా ఉంటాడు. ఇచ్చిన మాట మీద నిలబడతాడు. ఎలాంటి సందర్భంలోనైనా విజయ్ ప్రయత్నంలో లోపం ఉండదు. మీరు కూడా ఆయన్ను చూసి ఇన్స్ పైర్ అవ్వాలని కోరుకుంటున్నా. ఈ వన్ లాక్ చెక్ మీ అవసరాలకు ఉపయోగపడి మీ అందరికీ ఖుషి పంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - నాకు ఇంత ప్రేమ పంచుతున్న మీ కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు  చేయాలని ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇలా ఎవరైనా మనకు హెల్ప్  చేస్తే బాగుండు అని అనుకున్న వాడినే. చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంతా వెకేషన్ వెళ్తే నేను డబ్బులు ఇంట్లో అడగి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఉండిపోయేవాడిని. అప్పుడు మా ఫ్రెండ్స్ టూర్ లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అని ఆలోచించేవాడిని. తమ్ముడి ఇంజినీరింగ్ ఫీజు కోసం ఇబ్బందిపడుతున్నప్పుడు అలాంటి అవసరంలో ఎవరైనా కొంత డబ్బు ఇస్తే బాగుండును అనిపించేది. కానీ ఎవర్నీ అడగడానికి ఇష్టం ఉండేది కాదు. అవన్నీ దాటుకుని ఒక ఫ్యామిలీగా ఈ స్థాయికి చేరుకున్నా. ఇవాళ మీకు ఈ హెల్ప్ చేయగలుగుతున్నా అంటే అది నా పర్సనల్ కోరిక. ఈ లక్ష రూపాయలు అందిన తర్వాత కొంచెం సంతోషం కలిగి ఒత్తిడి తగ్గి, బలాన్నిచ్చి మీకు ఆనందంగా అనిపిస్తే నాకు అదే సంతృప్తినిస్తుంది. ఈ చిన్న సాయం మీకు ఉపయోగపడితే నాకు హ్యాపీ. నాకు థ్యాంక్స్ చెప్పకండి. మీతో నా ప్రేమను షేర్ చేసుకుంటున్నా అంతే. లాస్ట్ టైమ్ కొంతమంది పిల్లల్ని టూర్ కు పంపించా. ఈ ప్రోగ్రాం అనౌన్స్ చేసినప్పటి నుంచి 50 వేలకు పైగా అప్లికేషన్స్ వచ్చాయి. అయితే 100 మందికి మాత్రమే చేయగలుగుతున్నాం. ప్రతి ఇయర్ ఇంకొందరికి హెల్ప్ చేస్తా. ఇలా నేను స్ట్రాంగ్ గా ఉన్నంతవరకు, నేను సినిమాలు చేస్తున్నంతకాలం మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటాను. మీరు నాపై  చూపిస్తున్న ప్రేమకు థాంక్స్. అన్నారు.