బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:32 IST)

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఫాలోవ‌ర్స్ రికార్డ్‌

Vijay Devarakonda
Vijay Devarakonda
యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండకు సోష‌ల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ పెరిగిపోతూ వున్నారు. తాజాగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో జన గణ మన చిత్రం లాంఛ‌నంగా ముంబైలో ప్రారంభ‌మైంది. ఇందులో సోల్జ‌ర్‌గా న‌టిస్తున్న‌ట్లు తెలియ‌జేస్తూ, యుద్ధ హెలికాప్ట‌ర్‌లో దిగిన స‌న్నివేశాలు ఫాన్స్‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.
 
ఇప్ప‌టికే పూరీ, విజ‌య్ కాంబినేష‌న్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కిన  లైగర్ చిత్రం ఆస‌క్తి నెల‌కొంది. ఇందులో మైక్ టైస‌న్ వంటి రియ‌ల్ బాక్స‌ర్ న‌టించ‌డం చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది.  ఈ చిత్రం ఆగస్ట్ 25, 2022న థియేటర్లలో విడుదల కానుంది. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ఏమంటే, అర్జున్ రెడ్డి నటుడు ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన మైలురాయిని దాటాడు. అంత‌కుముందు 13 మిలియ‌న్ ఫాలోవున్న వున్న అతనికి తాజాగా ఆన్‌లైన్‌లో 15 మిలియన్లకు పైగా అనుచరులు జేరారు. ఈ సంద‌ర్భంగా బీర్‌తో ఛీర్ కొడుతూ అభిమానుల‌కు చీర్స్ చెబుతున్నాడు.