గురువారం, 10 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 29 మార్చి 2022 (16:32 IST)

ఆర్మీ గెట‌ప్‌తో విజయ్ దేవరకొండ జేజీఎం (జ‌న‌గ‌ణ మ‌న‌) ముంబైలో ప్రారంభం

Vijay Devarakonda Army getup
విజ‌య‌వంతంగా తొలి చిత్రాన్ని పూర్తిచేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరీ ధ్వ‌యం త‌దుప‌రి చిత్రం జేజీఎంను 3.08.2023న‌  విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డి
 
సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు పూరి జగన్నాధ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురుచూస్తున్న వెంచ‌ర్ ఇది.  ఈ రోజు ముంబైలో జరిగిన ప్ర‌తిష్టాత్మ‌క  కార్యక్రమంలో తమ తదుపరి వెంచర్ “JGM”ని గ్రాండ్‌గా ప్రారంభించారు.
హెలికాప్టర్ ఛాపర్ లో ప‌త్యేకంగా దిగిన విజ‌య్ దేవ‌ర‌కొండ వాకింగ్ స్ట‌యిల్‌, ఆర్మీ గెట‌ప్‌తో పాత్ర‌ప‌రంగా చాలా ఫ‌ర్‌ఫెక్ట్‌గా వున్నాడు. వినూత్నంగా ప్ర‌తిష్టాత్మ‌కంగా జరిగిన ఈ ఓపెనింగ్ ప్ర‌త్యేక‌తను సంత‌రించుకుంది. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకర స్టూడియోస్‌ డైరెక్ట‌ర్ సింగరావు పాల్గొన్నారు.
 
- ఇక ఈరోజు విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్‌లో ఇండియా మేప్‌తో పాటు కొంద‌రు సైనికులు క‌నిపించారు. యుద్ధం నేప‌థ్యంలో ఈ చిత్రం వుంటుంద‌ని తెలుస్తోంది. విజ‌య్ లుక్‌కు నెటిజ‌న్ అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌ అవుతోంది. 
 
పూరి జగన్నాధ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్,  డైరెక్షన్‌లో ఛార్మీ కౌర్, వంశీ పైడిపల్లి,  పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం JGM..  యాక్షన్ ఎంటర్‌టైనర్ గా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళ భాషల్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ఇది. 
 
ఈ చిత్రం గురించి దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ,  విజ‌య్‌తో మా త‌దుప‌రి ప్రాజెక్ట్ ‘జెజిఎమ్’ ప్రకటనను తెలియ‌జేయ‌డం నాకు చాలా సంతోషంగా ఉంది. విజయ్‌తో మళ్లీ కలిసి పనిచేయడం చాలా గొప్పగా అనిపిస్తుంది   JGM ఒక బలమైన కథనం, ఇది అల్టిమేట్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అన్నారు. 
 
సూప‌ర్ స్టార్ విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “ ఈ స్క్రిప్ట్ చాలా అద్భుతంగా, ఛాలెంజ్‌గా వుంది. క‌థ ప్రత్యేకమైనది. ప్రతి భారతీయుడినీ ట‌చ్ చేస్తుంది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గ‌ర్వంగా భావిస్తున్నాను. JGMలో  నేను ఇంతకు ముందు చేయనటువంటి పాత్ర చేస్తున్నా. ఇది ప్రేక్షకులపై ప్రభావం చూపుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఛార్మీ మరియు ఆమె బృందంతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా వుంద‌ని అన్నారు.
 
వంశీ పైడిపల్లి, శ్రీకర స్టూడియో నిర్మాత  మాట్లాడుతూ, “ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ JGM లో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్‌లతో కలిసి పనిచేయడం మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందే ఈ సినిమా ప్రతి భారతీయుడిని తట్టిలేపుతుందనే నమ్మకంతో ఉన్నాం అన్నారు. 
 
ప్ర‌పంచంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించ‌నున్న ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ 2022లో ప్రారంభమవుతుంది. 
 
జేజీఎం చిత్రాన్ని పూరి కనెక్ట్ & శ్రీకర స్టూడియో ప్రొడక్షన్ లో ఛార్మి కౌర్, వంశీ పైడిపల్లి  నిర్మిస్తున్నారు.  పూరి జగన్నాధ్ రచన & దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 3 ఆగస్టు 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.