1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 28 మార్చి 2022 (17:50 IST)

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ త‌దుప‌రి చిత్రం మిషన్ లాంచ్

Puri-charmi-vijaydevarakonda
పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరొక్క సారి కలిసి పని చేయనున్నారు. ఈ కొంబోలో ఆల్రెడీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపు దిద్దుకున్న క్రేజీ ప్రాజెక్ట్ "లైగర్" ఆగష్టు 25 న ప్రపంచ వ్యాప్తం గా విడుదలకి సిద్ధం గా ఉంది.
 
వీరి కలయిక లో రాబోయే తదుపరి చిత్రం గ్రాండ్ స్కేల్‌లో ఉండబోతుంది. ఈ అనౌన్సుమెంట్ ని చిత్ర బృందం సరికొత్త పంథా లో ఒక పోస్టర్ ద్వారా నేడు విడుదల చేసారు. ఈ ప్రచార చిత్రం లో మారణ ఆయుధాలు ఉంటూ  "14:20 గంటలు- 19.0760° N, 72.8777° E - నెక్స్ట్ మిషన్ లాంచ్ 29-03-2022.” ని సూచిస్తుంది.
 
ఇది కచ్చితంగా ప్రేక్షకులని ఆశ్చర్యపరిచే ప్రాజెక్ట్‌గా ఉండబోతుంది , తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలతో పాటు ఈ చిత్రానికి సంబందించిన 'ఇంపార్టెంట్ అప్డేట్' రేపు చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.