సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 22 మార్చి 2022 (21:51 IST)

రౌడీ హీరోతో చిందులేయనున్న ప్రియా ప్రకాష్ వారియర్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "లైగర్" అనే భారీ పాన్ ఇండియన్ సినిమా రూపుదిద్దుకుంటోంది. 
 
ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉండనుందట. అయితే ఈ పాటలో యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ చేయబోతుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలో అధికారిక సమాచారం వెలువడనుంది. 
 
ఇక లైగర్ విషయానికి వస్తే.. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.
 
లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయిన సంగతి తెలిసిందే.