మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (10:56 IST)

గీతా ఆర్ట్స్‌తో అర్జున్ రెడ్డి సినిమా.. సాదాసీదా హారర్ థ్రిల్లర్ కాదు..

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రాహుల్ ''ద

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఓ హారర్ థ్రిల్లర్ సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో రాహుల్ ''ది ఎండ్'' అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా అతనికి పెద్దగా గుర్తింపు సంపాదించిపెట్టలేకపోయినా.. టేకింగ్ పరంగా మంచి మార్కులు పడేలా చేసింది. 
 
ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రాహుల్ చేసే సినిమా గీతా ఆర్ట్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధమైందని.. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఈ సినిమా సాదాసీదా హారర్ థ్రిల్లర్ కాదని సినీ పండితులు అంటున్నారు.   కాగా విజయ్ దేవరకొండ చేతిలో ఇప్పటికే అరడజను సినిమాలున్నాయి. వీటిలో మూడు సెట్స్‌పై వున్నాయి. ఇక గీతా ఆర్ట్స్‌పై చేసే అర్డున్ రెడ్డి సరసన నటించే హీరోయిన్ ఎవరనే దానిపై చర్చ సాగుతోంది.