శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 1 జనవరి 2022 (13:06 IST)

ప్రేమపై గీత గోవిందం జంట ప్రకటన: రష్మికతో రౌడీ హీరో లవ్వులో వున్నాడా?

కొత్త సంవత్సరం వచ్చేసింది. అగ్రహీరోలకు సంబంధించిన సినిమాలకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో రౌడీ హీరో అయిన విజయ్ దేవరకొండ లైగర్ ఫస్ట్ గింప్స్ కూడా ఒకటి. అయితే విజయ్ సినిమాల విషయాన్ని పక్కనబెడితే.. ప్రస్తుతం ఆయన ప్రేమకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 
 
గీత గోవిందం చిత్రంతో పాపులర్ జంటగా మారిపోయారు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా. ఈ సినిమాతో రష్మిక టాలీవుడ్‌కి పరిచయం కాగా, విజయ్‌కి క్లాస్ హీరోగా పేరు వచ్చింది.
 
ఇక ఈ సినిమా తరువాత ఈ జంట డియర్ కామ్రేడ్ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించారు. అప్పటినుంచే ఈ జంట మధ్య ప్రేమ చిగురించిందని పుకార్లు గుప్పుమంటున్నాయి. వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఈ లవ్ బర్డ్స్ డిన్నర్లంటూ కెమెరా కంటపడుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని టాలీవుడ్ వర్గాల్లో గుసగుస.
 
ఇక ఈ కొత్త ఏడాది ఈ జంట ఒక కీలక ప్రకటన చేయనున్నారట. ఆ కీలక ప్రకటన వారి రిలేషన్ గురించే అయ్యి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ ప్రకటన ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.