బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 డిశెంబరు 2021 (13:44 IST)

విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు.. బీచ్ రోడ్‌ మూసివేత

ఏపీలోని ప్రధాన నగరాల్లో కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలు పెడుతున్నారు. విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ మనీష్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. నగరంలో న్యూయర్ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదన్నారు.
 
డిసెంబర్ 31న యారాడ నుండి భీమిలి వరకు బీచ్ రోడ్‌ను సాయంత్రం 6 గంటలకు మూసివేయనున్నట్లు తెలిపారు. నగర పరిధిలో ఉన్న ఫ్లైఓవర్లను కూడా సాయంత్రం 6 గంటల తర్వాత మూసివేస్తున్నట్లు ప్రకటించారు. 
 
బహిరంగ ప్రదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబోమని తెలిపారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఇటు న్యూ ఇయర్ వేడుకలపై విజయవాడలోనూ ఆంక్షలు విధించారు.