సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 28 జులై 2022 (12:42 IST)

అనన్యా నన్ను సైట్ కొట్టకు.. నాకు లైన్ వేయకు..విజయ్ రిక్వెస్ట్ (video)

Vijaydevarakonda_Ananya
Vijaydevarakonda_Ananya
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అతడికి విపరీతమైన ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది. తనదైన స్టైల్‌, మ్యానరిజంతో యువతను బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక అమ్మాయిలంటారా.. విజయ్ అంటే పడి చస్తారు. లైగర్ సినిమా ద్వారా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. 
 
లైగర్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ అక్కడ సైతం మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్ యంగ్ హీరోయిన్లను బాగా ఆకట్టుకున్నాడు. 
 
ఇటీవల కరణ్‌ జోహార్‌ ‘కాఫీ విత్‌ కరణ్‌’లో సారా అలి ఖాన్‌, జాన్వీ కపూర్‌లు విజయ్‌పై మనసు పారేసుకున్నట్లు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కాఫీ విత్‌ కరణ్‌ షోలో విజయ్‌, తన ‘లైగర్‌’ బ్యూటీ అనన్య పాండేతో కలిసి సందడి చేశాడు. 
 
త్వరలోనే ఇందుకు సంబంధించిన ఫుల్‌ ఎపీసోడ్‌ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ఆసక్తికర సన్నివేశాలకు సంబంధించిన వీడియోలను షేర్‌ చేస్తూ ఎపిసోడ్‌లోపై హైప్‌ క్రియేట్‌ చేస్తుంది హాట్‌స్టార్‌. 
 
తాజాగా అనన్యతో నాకు సైట్‌ కొట్టకు అంటూ విజయ్‌ క్యూట్‌గా రిక్వెస్ట్‌ చేసిన వీడియోను డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.