శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 8 నవంబరు 2019 (21:54 IST)

టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ల మధ్య వార్, ఎవరు?

విజయశాంతి-టబు. వీరి గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చక్రం తిప్పారు వీరిద్దరు. టాప్ హీరోయిన్లలో వీరి స్థానం అప్పట్లో పదిలం. చిరంజీవి, నాగార్జున, బాలక్రిష్ణ ఇలా అగ్రనటులతో వీరు నటించారు. విజయశాంతి అయితే కెమెరాకు దూరంగా ఉండిపోయారు. అంటే సినిమాలు చేయడం మానేశారు. 
 
విజయశాంతి సినిమాలు మానేసి సరిగ్గా 13 యేళ్ళ అవుతోంది. 13 సంవత్సరాల గ్యాప్ తరువాత సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఒక పాత్ర చేస్తోంది విజయశాంతి. అది కూడా ప్రొఫెసర్ భారతి పాత్ర. ఈ పాత్రలో విజయశాంతి బాగా నటించారంటోంది సినిమా యూనిట్. అయితే మరో హీరోయిన్ టబు కూడా అలా వైకుంఠపురం సినిమాలో నటిస్తోంది. ఈమెది ఆ సినిమాలో కీ రోల్. 
 
బాలీవుడ్లోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్న టబు చాలా గ్యాప్ తరువాత తెలుగులో సినిమాలను ప్రారంభించింది. త్రివిక్రమ్ లాంటి దర్సకుడి సినిమాలో టబు నటించడం ఇప్పుడు తెలుగు సినీపరిశ్రమలో చర్చ జరుగుతోంది.

47 యేళ్ళ టబు నవంబర్ 4వ తేదీ పుట్టినరోజు కూడా జరుపుకుంది. వయస్సు పెరిగినా తరగని అందంతో ఉన్న టబు అల వైకుంఠపురములో అదరగొడుతుంది అంటున్నారు అభిమానులు. ఇద్దరు పాత హీరోయిన్లు కొత్తగా తెలుగు సినిమాల్లో నటిస్తుండటం వారి సినిమాల్లో ఎవరిది విజయం సాధిస్తుందోనన్న చర్చ జరుగుతోంది.