1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 మే 2023 (13:08 IST)

రూ.58 లక్షలు ఖర్చు చేశారు.. చిరంజీవి, ఉపాసన గ్రేట్.. పొన్నాంబళం

Ponnambalam
Ponnambalam
నటుడు పొన్నాంబళం మెగాస్టార్ చిరంజీవి సహృదయతపై కృతజ్ఞతలు తెలిపారు. తాను తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమయంలో సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదని పొన్నాంబళం అన్నారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవిగారే తనకు అండగా నిలిచారని చెప్పారు. అనారోగ్య సమయంలో చిరంజీవి, ఆయన కోడలు ఉపాసన చేసిన సాయం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు.
 
కొన్నేళ్ల క్రితం తాను నిర్మించిన మూడు సినిమాలు పరాజయం పాలైనాయని.. ఎంతో నష్టపోయానని అదే సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురైనానని తెలిపారు. కిడ్నీలు పాడైపోవడంతో... డయాలసిస్ చేయించుకునేందుకు కూడా డబ్బుల్లేవని వాపోయారు. 
 
అలాంటి సమయంలో శరత్ కుమార్, ధనుష్ కొంత డబ్బు పంపారని.. ఆ సమయంలో చిరంజీవి గారికి కాల్ చేసి సాయం అడిగానని వెల్లడించారు. ఆ తర్వాత అపోలో ఆస్పత్రికి వెళ్లమని పంపారని.. ఉపాసన కాల్ చేసి మరీ అపోలోకు వెళ్లమని చెప్పారని వెల్లడించారు. 
 
వాళ్లిద్దరి సాయం చూసి ఆశ్చర్యపోయానని.. చెన్నై అపోలో ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేయించారని.. ఇందుకోసం ఒకటి కాదు రెండు కాదు.. రూ.58 లక్షలు ఖర్చు చేశారని పొన్నాంబళం తెలిపారు. తానింకా ప్రాణాలతో వున్నానంటే.. అది చిరంజీవి వల్లనేనని చెప్పారు. 
 
ఆయన తనకు పునర్జన్మనిచ్చారని చెప్పుకొచ్చారు. త్వరలో పూర్తిగా కోలుకుని షూటింగ్‌కు వెళ్తానని వెల్లడించారు. ఇకపై ఫైట్స్ సీన్స్‌లో కాకుండా.. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తానని పొన్నాంబళం క్లారిటీ ఇచ్చారు.