గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (11:16 IST)

విశ్వక్ సేన్ దాస్ కా ధమ్కీ లో మాస్ సాంగ్ విడుదల

Vishwak Sen
Vishwak Sen
హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' అత్యంత భారీ బడ్జెట్‌తో అత్యున్నత  నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. విశ్వక్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా  నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఫస్ట్ సింగిల్ ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లకు  ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు చార్ట్‌బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఈ వీడియో సాంగ్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ మావాబ్రో లిరికల్ వీడియోను విడుదల చేశారు.
 
ఇది రామ్ మిరియాల స్పెషల్. స్టార్ సింగర్  లైవ్లీ బీట్‌లతో పెప్పీ నంబర్‌ను స్కోర్ చేశాడు. అతని వాయిస్ కూడా లవ్లీ గా ఉంది. నిజానికి, రామ్ మిరియాల వాయిస్ మరో స్థాయికి తీసుకువెళుతుంది. ట్యూన్ క్యాచీగా ఉంది, కాసర్ల శ్యామ్ సాహిత్యం నిజానికి ప్రతి సామాన్యునికి కనెక్ట్ అవుతుంది. విశ్వక్ సేన్ ఈ పాటలో లైవ్లీగా  కనిపించాడు   అతని డ్యాన్స్ చూడటానికి ట్రీట్‌గా వుంది. ఇది ఆల్బమ్ నుండి మరొక బ్లాక్ బస్టర్ నంబర్ అవుతుంది.
 వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు.
 
ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం.
 దాస్ కా ధమ్కీ ఫిబ్రవరి 17, 2023న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.