1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 24 ఫిబ్రవరి 2024 (14:54 IST)

అఘోరా పాత్రలో విశ్వక్ సేన్ గామి నుంచి సామహాస యాత్ర పాట

Vishwak Sen - Gami song
Vishwak Sen - Gami song
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 'గామి' ప్రచార కార్యక్రమాలు జోరందు కున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు చిన్న టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు, మ్యూజికల్ జర్నీ టైం. మేకర్స్ ఫస్ట్  సింగిల్ గమ్యాన్నే పాటని విడుదల చేశారు.
 
స్వీకర్ అగస్తీ స్కోర్ చేసిన 'గమ్యాన్నే' అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ సేన్ తన వ్యాధికి మందు వెతకాలనే తపనతో కూడిన అన్వేషణకి సంబధించిన పాట. అతని వద్ద రూట్ మ్యాప్ ఉంది, నివారణను కనుగొనడానికి ఇది సాహసోపేతమైన ప్రయాణం. తనకి మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధి వుంది. సనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాట వాస్తవానికి వ్యాధి కారణంగా అతను పడే బాధను చూపుతుంది. సుగుణమ్మ, అనురాగ్ కులకర్ణి,  స్వీకర్ అగస్తీల అద్భుత గానం మరింత ఆకర్షణీయంగా వుంది.  
 
ఈ పాట ప్రయాణాన్ని చాలా ప్రభావవంతంగా వివరిస్తుంది, విశ్వక్ సేన్ భావోద్వేగాలను అద్భుతంగా పండించారు.  హాంటింగ్ ఎఫెక్ట్ ఉన్న ఈ పాటను థియేటర్లలో చూసినప్పుడు మరింత ఎఫెక్టివ్ గా వుంటుంది.
 
విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ దానిని అందజేస్తుంది.
 
హారిక పెడదా, మరియు మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం. గామి  ట్రైలర్ ఫిబ్రవరి 29 న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు. గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.