గురువారం, 31 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 నవంబరు 2022 (16:11 IST)

విష్వక్‌ సేన్ "ధమ్కీ" చిత్రం ఫస్ట్ లుక్ అదిరిపోయింది..

dhamki movie
యువ నటుడు విష్వక్‌సేన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "ధమ్కీ". ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ నటించారు. వచ్చే యేడాది ఫిబ్రవరి నెలలో నాలుగు భాషల్లో విడుదలకానుంది. 
 
కాగా, "ఫలక్‌నుమా దాస్" చిత్రంతో తనలోని దర్శకుడిని వెండితెరకు పరిచయం చేసిన విష్వక్..  ఇపుడు మెగాఫోన్ పట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో తాను హీరోగా ధమ్కీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం పోస్టర్‌ను తాజాగా రిలీజ్ చేయగా, మాస్, క్లాస్ కలగలిసిన లుక్‍లో ఆకట్టుకున్నాడు. 
 
రావు రమేష్, పృథ్విరాజ్, హైపర్ ఆదిలు కీలక పాత్రలను పోషించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్‌సేన్‌ సినిమాస్‌లు కలిసి సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించారు.