ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 జులై 2024 (11:17 IST)

డీమాంటీ కాలనీ 2 ఇంట్లో ఏమిజరిగింది?

Arul Nidhi, Priya Bhavani
Arul Nidhi, Priya Bhavani
బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీకి సీక్వెల్ గా రూపొందిన సినిమా డీమాంటీ కాలనీ 2. ఈ సినిమాలో అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్నారు. అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని రాజ్ వర్మ ఎంటర్ టైన్మెంట్ మరియు శ్రీ బాలాజీ ఫిలింస్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు రూపొందించిన డీమాంటీ కాలనీ 2 సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉందన్న ఆర్జీవీ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
 
డీమాంటీ కాలనీ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే - డీమాంటీ ఇంట్లో అనూహ్యమైన ఘటనలు జరుగుతుంటాయి. ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన చైన్ తిరిగి ఆ ఇంటికే ఎలాగోలా చేరుతుంటుంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు వెళ్లిన వారు చనిపోతుంటారు. ఓ సందర్భంలో ప్రధాన పాత్రధారులంతా ఆ ఇంట్లోకి వెళ్తారు. వారికి అక్కడ నమ్మలేని, భయంకర ఘటనలు ఎదురవుతాయి. డీమాంటీ ఇంట్లో ఉన్న ఆ శక్తి ఏంటి, దాని నుంచి ఎలా ప్రాణాలు కాపాడుకున్నారు అనేది ట్రైలర్ లో గూస్ బంప్స్ తెప్పించేలా చూపించారు దర్శకుడు అజయ్ ఆర్ జ్ఞానముత్తు
 
నటీనటులు - అరుల్ నిధి, ప్రియ భవానీ శంకర్, అన్తి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవింద్ రాజన్, సర్జనో ఖాలిద్, అర్చన రవిచంద్రన్