బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (17:55 IST)

చివరి కోరిక తీరకుండానే చనిపోయిన రామచక్కని సీతయ్య

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా గురువారం వేలాది మంది అభిమానుల మధ్య ముగిశాయి. అయితే, ఆయన తన చివరి కోరికను తీర్చు

నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ హీరో, టీడీపీ మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు కూడా గురువారం వేలాది మంది అభిమానుల మధ్య ముగిశాయి. అయితే, ఆయన తన చివరి కోరికను తీర్చుకోకుండానే చనిపోయారు.
 
సెప్టెంబర్ 2వ తేదీన ఆయన పుట్టిన రోజు. ఆ రోజున ఎలాంటి హంగూ ఆర్భాటాలకు పోకుండా, వాటికయ్యే డబ్బులను ఇటీవల భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళ సహాయనిధికి పంపించాలని అభిమానులను కోరారు. అలా తన పెద్ద మనసును చాటుకున్నారు. 
 
అయితే, తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఆయనకు తీరని కోరిక ఒకటి మిగిలిపోయిందనేది ఈ వార్త సారాంశం. హరికృష్ణ గతంలో అనేక చిత్రాల్లో నటించారు. సినీ అభిమానులను మెప్పించారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో చేసిన 'లాహరి లాహరి లాహరిలో', 'సీతారామరాజు', 'సీతయ్య' తదితర చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల్లో హరికృష్ణ తన నటవిశ్వరూపాన్ని చూపారు. చివరిగా ఆయన కృష్ణతో కలసి 'శ్రావణమాసం' చిత్రంలో నటించారు. 
 
ఆ తర్వాత అనేక మంది దర్శకులు, నిర్మాతలు కూడా ఆయనను సంప్రదించి.. తమ చిత్రాల్లో నటించాలని కోరారు. కానీ, ఆయన సున్నితంగా తిరస్కరించారు. పైగా, మళ్లీ సినిమా అంటూ చేస్తే తన కుమారులు కల్యాణ్ రామ్, తారక్‌లు కలసి నటించే మూవీలో మాత్రమే నటిస్తానని చెప్పేవారట. కానీ, రామసక్కని సీతయ్య తన చివరి కోరికను నెరవేర్చుకుండానే ఎవరికీ అందనంత దూరానికి వెళ్లిపోయారు.