ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:57 IST)

ప్ర‌భుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అంగీకారమేః నిర్మాత దిల్ రాజు

dil Raju, venu
`ఈ కొవిడ్ టైమ్ లో ఎంత మంది చూడాలో అంత కంటే ఎక్కువే వ‌కీల్‌సాబ్ చూస్తున్నారు. థియేటర్లకు రిపీటెడ్గా వస్తున్నారు. ఇంకా రెండు ఆప్షన్స్ మా ముందు ఉన్నాయి. వ‌య‌స్సు పైబ‌డిన‌వారు థియేటర్లకు వెళ్లడానికి భయపడితే రేపు ఓటీటీ లేదా టీవీలో సినిమా చూస్తారు. ఒకటికి పది సార్లు సినిమా చూస్తాడనే నమ్మకం మాకుంది. మొదటి మూడు రోజులు ఎక్కువగా క్రౌడ్స్ ఉండేవి థియేటర్ల దగ్గర. ఇప్పుడు థియేటర్లలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇక ప్రభుత్వం సీటింగ్ విధానంగా ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అంగీకారమే. మేం కోరుకునేది కూడా అదే. ప్రేక్షకులు సినిమా చూడాలి అదే టైమ్ లో కొవిడ్ జాగ్రత్తలన్నీ పాటించాలి. సేఫ్ గా ఇంటికి వెళ్లాలి` అని దిల్ రాజు తెలియ‌జేశారు.
 
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ లెటెస్ట్ సూపర్ హిట్ "వకీల్ సాబ్". ఈ సినిమాను దిల్ రాజు నిర్మించగా, శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. "వకీల్ సాబ్" విజయవంతంగా రెండో వారం ప్రదర్శితం అవుతున్న సందర్భంగా నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శ్రీరామ్ వేణు సినిమా సక్సెస్ గురించి మాట్లాడారు.
 
దిల్ రాజు మాట్లాడుతూ, పెద్ద సినిమా అంటే డబ్బుల వసూళ్ల పరంగా కాదు, ఎంతమంది ఆడియెన్స్ కు రీచ్ అయ్యింది అనేది మా లక్ష్యం. నేను వకీల్ సాబ్ సక్సెస్ మీట్ రోజు కూడా ఇదే చెప్పాను. డబ్బులు వస్తుంటాయి, అది ముఖ్యం కాదు. అవి టీవీ, థియేటర్, ఓటీటీ ఇలా మూడు విధాలుగా నిర్మాతకు డబ్బులు వస్తాయి. థియేటర్లో మేము ఎక్స్ ట్రీమ్ గా వెళ్లిపోయాం. ఇలా ప్రజలకు సినిమా రీచ్ అవడంలో, రెవెన్యూ విషయంలో మేము సూపర్ హ్యాపీ. అనుకున్నది సాధించాం. అడ్డంకులు దాటాం, కొవిడ్ దాటాం, ఇప్పుడు థియేటర్లో అనుకున్న రెస్పాన్స్ వస్తోంది. ఇంతకంటే కావాల్సింది ఏముంది. నేను సినిమా చేసినప్పుడు మా దర్శకులతో ఒకటే చెబుతాను. చేసిన సినిమా వల్ల సంతృప్తి రావాలి. రెండోది ఎకానమి, నిర్మాతగా నాకు డబ్బు కూడా ముఖ్యమే. వకీల్ సాబ్ తో ఈ రెండు విషయాల్లో సంతోషంగా ఉన్నాం.  మూడోది ఆడియెన్స్ మనసుల్లోకి వెళ్లే సినిమాలు అరుదు. వకీల్ సాబ్ అలాంటి సినిమా అయినందుకు మరింత ఆనందంగా ఉంది. మరో టైమ్ లో సినిమా విడుదల చేస్తే ఇంకా పెద్ద హిట్ అయ్యేదేమో అని కొందరు అంటున్నారు. కానీ రేపు అనేది ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. 
 
ప్రేక్షకులు, సొసైటీలోని పెద్దవాళ్లు, ఇండస్ట్రీ స్టార్స్, ఫ్యాన్స్ అంతా వకీల్ సాబ్ను అప్రిషియేట్ చేశారు. ఎంత డబ్బు పెడితే సినిమాకు ఎంత తిరిగొస్తుందనేది నాకు పక్కా లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలోనూ సక్సెస్ అందుకున్నాం. దేశంలో మిగతా చిత్ర పరిశ్రమలతో చూస్తే మన టాలీవుడ్ చాలా సేఫ్ గా ఉందనే చెప్పాలి. ఇటీవల 12 సినిమాల దాకా రిలీజ్ అయితే అందులో ఐదారు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. క్రాక్ దగ్గర నుంచి ఉప్పెన, జాతిరత్నాలు, జాంబిరెడ్డి ఇలా సక్సెస్ లు వచ్చాయి. అదే బాలీవుడ్ లో సినిమా రిలీజ్ చేయాలంటేనే సందేహపడుతున్నారు. గత నాలుగు నెలలుగా మనం ధైర్యం చేయగలిగాం. సినిమాలు ఆగితే కార్మికులు, టెక్నీషియన్స్ అందరికీ ఉపాధి పోతుంది. ప్రతి సినిమా విజయం మనకో బాధ్యత నేర్పుతుంది. వకీల్ సాబ్ విజయం మాకు మరింత బాధ్యత ఇచ్చింది. ఇలాంటి మంచి సినిమాలను జాగ్రత్తగా చేయాలని, చేస్తే ప్రశంసలు పేరు వస్తాయని మరోసారి గుర్తు చేసింది. అన్నారు.
 
దర్శకుడు శ్రీరామ్ వేణు మాట్లాడుతూ...వకీల్ సాబ్ ఈరోజు మహిళలకు కావాల్సిన సినిమా. మా సినిమా మహిళలకు దగ్గరైంది. వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో వస్తున్న సినిమా అంటే ఒక విలువ ఉంటుంది. మేము ఎంత కష్టపడ్డా, ఆడియెన్స్ ఆదరిస్తేనే ఆ సినిమాకు విలువ. హిట్ గానీ సూపర్ హిట్ గానీ ప్రేక్షకులే ఇవ్వాలి. ఇవాళ ప్రేక్షకుల దగ్గర నుంచి మాకు అలాంటి ఆదరణ దక్కుతోంది. బయట పరిస్థితులు బాగా లేకున్నా వకీల్ సాబ్ సినిమాకు ఆదరణ తగ్గడం లేదు. ఈ విజయం మీరు మాకూ, తెలుగు చిత్ర పరిశ్రమకు ఇచ్చిన బహుమతి. మంచి సినిమా చేస్తే ఆ సినిమా విజయానికి ఏ అడ్డంకీ ఉండదని తెలుగు ప్రేక్షకులు వకీల్ సాబ్ సినిమాతో మరోసారి నిరూపించారు. మీరు ఇచ్చిన విజయం జీవితాంతం మా మనసులో ఉంటుంది. రాజు గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా కష్టపడ్డాను. కానీ ఇంత పెద్ద విజయాన్ని ఊహించలేదు.

మాకు క‌రోనా రాలేదు
మా టీమ్ అందరికీ కరోనా వచ్చిందనే పుకార్లు వస్తున్నాయి. వాటిలో నిజం లేదు. అందరం రోజూ టెస్ట్ చేసుకుంటున్నాం. నెగిటివ్ వస్తోంది. మాకూ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమంతా జాగ్రత్తగానే ఉంటున్నాం. కరోనా సోకిన వారు స్వయంగా వాళ్లే వెల్లడించారు. యూనిట్ అందరికీ వచ్చిందనడంలో నిజం లేదు.అన్నారు.