శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2024 (10:06 IST)

తెలుగు నటి నీలం ఉపాధ్యాయతో ప్రియాంక చోప్రా తమ్ముడి నిశ్చితార్థం

siddharth - neelam
తెలుగు సినీ నటి నీలం ఉపాధ్యాయతో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా తమ్ముడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరిగింది. గతంలో ఇషితా కుమార్‌తో సిద్ధార్థ్ నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తొలి నిశ్చితార్థం ఏమైందో తెలియదుగానీ ఇపుడు టాలీవుడ్ నటి నీలం చోప్రాతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని వీరిద్దరూ తమ ఇన్‌స్టా ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు. అలాగే, ఫోటోలను కూడా షేర్ చేశారు. సిద్ధార్థ్ ఫ్లోరల్ బంద్‌‍గల సూట్ ధరిస్తే, నీలం సంప్రదాయ పర్పుల్ ఎంబ్రయిడరీ సూట్ ధరించింది. నిశ్చార్థ కేకుపై జస్ట్ రోకాఫీడ్ అని రాసివుంది. 
 
ప్రియాంకా కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సిద్ధార్థ్ నీలం ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోల్లో ప్రయాంక భర్త నిక్ జోనాస్ కూడా కనిపిస్తున్నారు. సిద్దార్థ్‌కు గతంలో ఇషితా కుమార్ అనే యువతితో నిశ్చితార్థం జరిగింది. వీరి వివాహం గత 2019 ఏప్రిల్ నెలలోనే జరగాల్సివుంది. కానీ, ఈ వివాహం అనూహ్యంగా రద్దు చేసుకున్నారు. 
 
కాగా, నీల ఉపాధ్యాయ గత 2010లో తొలి సినిమా చేసినప్పటికీ అది ఆటకెక్కంది. రెండేళ్ల తర్వాత తెలుగు "మిస్టర్ 7" అనే సినిమాలో నటించింది. 2013లో అల్లరి నరేశ్‌తో యాక్షన్ "త్రీడీ" అనే మూవీలో నటించింది. అదే యేడాది ఉన్నోడు "ఒరు నాల్" సినమాతో తమిళంలో అరంగేట్రం చేసింది. అయితే, ఇటు తెలుగు, అటు కోలీవుడ్ భాషల్లో ఆమె నిలదొక్కుకోలేక పోయింది.