సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (14:06 IST)

బ్యూటీషియన్‌ పద్మతో కలిసి సూసైడ్ చేసుకునేందుకే పద్మకు మత్తు ఇచ్చాడా...

తామిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బ్యూటీషియన్ పద్మకు ఆమె ప్రియుడు నూతన్ కుమార్ విక్టర్ ముందుగా మత్తు ఇచ్చి దాడి చేసినట్టు సమాచారం. అయితే, ఇద్దరూ కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారన్న విషయంల

తామిద్దరం కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు బ్యూటీషియన్ పద్మకు ఆమె ప్రియుడు నూతన్ కుమార్ విక్టర్ ముందుగా మత్తు ఇచ్చి దాడి చేసినట్టు సమాచారం. అయితే, ఇద్దరూ కలిసి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారన్న విషయంలో మాత్రం క్లారిటీ రావడంలేదు. 
 
బ్యూటీషియన్‌ పద్మపై హత్యాయత్నం కేసులో పలు అంశాలు మిస్టరీగా మారాయి. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బాధితురాలు పల్లె పద్మను పోలీసులు మంగళవారం కొద్ది సమయం విచారించారు. 
 
నిజానికి భర్తకు దూరమైన పద్మ.. గత నాలుగేళ్లుగా నూతన్ కుమార్‌తో సహజీవనం చేస్తోంది. అయితే, వీరిద్దరి మధ్య గత యేడాది కాలంగా తరుచూ వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పెదపాడు, హనుమాన్‌జంక్షన్‌ పోలీస్‌ స్టేషన్లులో పద్మ ఫిర్యాదు కూడా చేసింది. నూతనకుమార్‌కు ఏలూరులో ఉన్న ఇల్లు విక్రయించగా వచ్చిన రూ.35 లక్షలు వివాదానికి కారణమా? అనే అనుమానం కూడా వ్యక్తమవుతోంది. 
 
ఇదిలావుంటే, ఈనెల 23వ తేది రాత్రి పద్మ తన భర్త వద్ద ఉంటున్న పెద్ద కుమార్తెకు ఫోన్‌ చేసి నూతన కుమార్‌తో కలిసి ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పినట్లు భర్త సూర్యనారాయణ ఇప్పటికే మీడియాతో వెల్లడించాడు. ఇదేవిషయాన్ని పద్మ కూడా ఆస్పత్రిలో పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరూ ఎందుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకోవాల్సి వచ్చిందనే విషయం మిస్టరీగా మారింది.