శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (11:46 IST)

నా భర్త చాలా మంచోడు.. బ్యూటీషియన్ పద్మే కిలాడీ...

నా భర్త చాలా మంచోడని, బ్యూటీషియన్ పద్మే తన భర్త ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందనీ బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీత ఆపోపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు కూడ

నా భర్త చాలా మంచోడని, బ్యూటీషియన్ పద్మే తన భర్త ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందనీ బ్యూటీషియన్ పద్మపై హత్యాయత్నం చేశాడని అనుమానిస్తున్న నూతన్ కుమార్ భార్య సునీత ఆపోపించింది. ఈ మేరకు ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. 
 
మరోవైపు, బ్యూటీషియన్ పద్మపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడినట్టు అనుమానిస్తున్న నూతన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. దీంతో ఆయన భార్య తెరపైకి వచ్చింది. ఫలితంగా ఈ కేసు మలుపు తిరిగింది. పద్మ కేసులో అసలు నిందితులు ఎవరన్నది ఇంకా మిస్టరీగానే ఉండగా, తెరపైకి నూతన్ కుమార్ భార్య సునీత వచ్చి సంచలన ఆరోపణలు చేసింది. తన కుటుంబం ఛిన్నాభిన్నం కావడానికి పద్మే కారణమని ఆరోపించింది.
 
2012లో తన వివాహం తర్వాత, నూతన్ ఓ షోరూంలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, అక్కడ పరిచయమైన పద్మ తన భర్తను వలలో వేసుకుందని సునీత ఆరోపించింది. ఆమెను కలవడం నూతన్‌కు ఇష్టముండేది కాదని, అయినా నిత్యమూ వేధిస్తూ, తనతో విడాకులు తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండేదని చెప్పింది. ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడటానికి ఆమె చేసిన తప్పులే కారణమని చెప్పింది. ఫలితంగానే తన భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆరోపించింది.