గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (13:38 IST)

కన్నుగీటి.. జుకర్ బర్గ్‌కే చుక్కలు చూపించిన ప్రియా వారియర్

కన్నుగీటి.. తన హావభావాలతో సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా ఫేస్‌బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌కే చుక్కలు చూపించింది. ఎలాగంటారా? జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ

కన్నుగీటి.. తన హావభావాలతో సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన కేరళ కుట్టి ప్రియా ప్రకాష్ వారియర్.. తాజాగా ఫేస్‌బుక్ సృష్టికర్త జుకర్‌బర్గ్‌కే చుక్కలు చూపించింది. ఎలాగంటారా? జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 4 మిలియన్ల ఫాలోవర్స్ వుంటే.. ఈ 18 ఏళ్ల ప్రియా వారియర్ మాత్రం 4.5 మిలియన్ల మందికి పైగా అభిమానులను సంపాదించుకుంది. 
 
ప్రియా ప్రకాశ్ వారియర్ ఫోటో పోస్ట్ చేసిందంటే.. మిలియన్ల సంఖ్యలో లైకులు వెల్లువెత్తుతున్నాయి. ఇలా సోషల్ మీడియాలో ప్రియా వారియర్ సూపర్ స్టార్‌గా మారిపోయింది. ''ఒరు ఆదార్ లవ్'' అనే మలయాళ సినిమాలోని పాట 'మాణిక్య మలరాయ పూవీ' పాటతో రాత్రికి రాత్రే స్టార్ అయిన ప్రియా వారియర్ ఇప్పటికే ఫాలోవర్స్ విషయంలో రాకెట్ వేగంలో దూసుకెళ్తోంది. 
 
ఫాలోవ‌ర్స్ ప‌రంగా ఇప్ప‌టికే ప్రముఖ నటులు స‌న్నీలియోన్‌, క‌త్రినా కైఫ్ వంటి సెల‌బ్రిటీల‌ని వెనక్కి నెట్టిన ప్రియా వారియ‌ర్ తాజాగా ఫేస్‌బుక్ సృష్టిక‌ర్త జుక‌ర్‌బ‌ర్గ్‌ని కూడా అధిగమించింది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌లో జుకర్ బర్గ్‌ను ప్రియా వారియర్ వెనక్కి నెట్టింది. అంతేకాకుండా స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోను కూడా పక్కనబెట్టేలా చేసింది. ఒక్క రోజులో 600,000 ఫాలోవర్స్‌ని సంపాదించడం ద్వారా రొనాల్డోను కూడా వెనక్కి పంపింది. దీనిని బట్టి చూస్తే ప్రియా వారియర్ త్వరలోనే అంతర్జాతీయ స్టార్‌గా ఎదిగిపోయే ఛాన్సుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.