మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Updated : గురువారం, 15 ఫిబ్రవరి 2018 (19:01 IST)

ప్రియా వారియర్... 'బాహుబలి' అనుష్క శెట్టిని బీట్ చేసిందా? షారూక్ సంగతేంటి?

18 ఏళ్ల మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఇపుడీ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో టాప్ ట్రెండింగ్ అయ్యింది. ఒరు ఆడార్ లవ్ అనే చిత్రంలోని పాటతో కేవలం 26 సెకన్ల వీడియోతో ఇంటర్నెట్టులో కనబ

18 ఏళ్ల మలయాళ నటి ప్రియా ప్రకాష్ వారియర్. ఇపుడీ పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలో పలు దేశాల్లో టాప్ ట్రెండింగ్ అయ్యింది. ఒరు ఆడార్ లవ్ అనే చిత్రంలోని పాటతో కేవలం 26 సెకన్ల వీడియోతో ఇంటర్నెట్టులో కనబడిన ఈ ముద్దుగుమ్మ ఓ స్థాయిలో క్రేజ్ సాధించేసింది.


ఈమె ప్రధానమంత్రి మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కత్రినా కైఫ్, విరాట్ కోహ్లి వంటి హేమాహేమీల పాపులారిటీని మించి పోయిందనీ నెటిజన్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఇకపోతే ఇప్పుడీ కేరళకుట్టి ఎవరు? ఎక్కడ చదివింది అనే వివరాల కోసం నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఈమె విమలా కళాశాలలో బీకాం చదువుతోంది. మోహినీ ఆట్టం, పలు డ్రామాలు, నాటకాల్లో నటించింది కూడా. 
 
'బాహుబలి' అనుష్కనే మించేసింది
ఇకపోతే ఈమె పాపులారిటీ దెబ్బకు బాహుబలి అనుష్క కూడా వెనకబడిపోయిందట. ఏ విషయంలోనో తెలుసా? ఆమెకున్న ఇన్‌స్టాగ్రాం ఫాలోయర్ల విషయంలో. అనుష్క పోస్ట్ చేసిన 465 పోస్టులకు ఆమెకు 2 మిలియన్ల ఫాలోయర్లుంటే ప్రియా వారియర్ పోస్ట్ చేసిన 87 పోస్టులకే 2.3 మిలియన్ల ఫోలోయర్లు వుండటం గమనార్హం. త్రిషకు 15 ఏళ్ల కాలంలో ఆమెకు 1.5 మిలియన్ల ఫాలోయర్లు మాత్రమే వున్నారు. అమలా పాల్ 323 పోస్టులకు ఆమెకున్న ఫాలోయర్ల సంఖ్య 1.2 మిలియన్లు మాత్రమే. మొత్తమ్మీద సోషల్ మీడియాలో ఇంత వేగంగా ఫోలోయర్లను సొంతం చేసుకుని ప్రియా వారియర్ రికార్డునే సృష్టించింది. 
 






షారూక్ ఖాన్‌తో నటించాలనుందట...
వాలెంటెన్స్ డే సందర్భంగా కన్నుగీటి సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను భవిష్యత్తులో ఎవరి సరసన నటించాలో ప్రియా ఆకాశ్ వారియర్ తెలిపింది. తనకు షారూఖ్ ఖాన్‌ సరసన నటించాలని ఉన్నట్లు తెలిపింది. అలాగే విలక్షణ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో సినిమా చేయాలని వున్నట్లు ప్రియా ప్రకాష్ వారియర్ చెప్పుకొచ్చింది. 18 ఏళ్ల ప్రియా ఇంటర్వ్యూలో హిందీలో ఆకట్టుకుంది. 
 
సరళంగా హిందీ మాట్లాడి అదరగొట్టింది. కేరళలో పుట్టినా ముంబైలో పెరిగానని.. హిందీ చదువుకున్నానని ప్రియా ఆకాష్ వారియర్ వెల్లడించింది. అలాగే తాజా ఇంటర్వ్యూలో ప్రియా ఆకాష్‌ తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పేసింది. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంటేనే ఎక్కువ ఇష్టమని ఈ వాలు కనుల వయ్యారి భామ తెలిపింది. 
 
ఇక ''ఒరు ఆదార్ లవ్''లో కన్నుగీటే సన్నివేశం గురించి ప్రియా మాట్లాడుతూ.. కన్ను మీటే ముందు కనుబొమ్మలను పైకెత్తడం దర్శకుడు అడగటంతో అప్పటికప్పుడు చేశానని చెప్పింది. అది ముందుగా ప్లాన్ చేసుకుని షూటింగ్ చేసింది కాదని ప్రియా క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే.. ప్రియా వారియర్ నటిస్తున్న ఒరు ఆదార్ లవ్ సినిమా మార్చి మూడో తేదీన విడుదల కానుంది.