శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2018 (12:55 IST)

జీఎస్టీ ట్రైలర్ వద్దు బాబోయ్.. తొలగించిన యూట్యూబ్?

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా జీఎస్టీ. ఈ సినిమాలో మియా మాల్కోవా అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడంతో ఈ సినిమా నిషేధానికి గురైంది. పోర్న్ సినిమాకు దేవుడికి లింకు పెడుతూ జీఎస్టీ తీసిన

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా సినిమా జీఎస్టీ. ఈ సినిమాలో మియా మాల్కోవా అందాలను విచ్చలవిడిగా ప్రదర్శించడంతో ఈ సినిమా నిషేధానికి గురైంది. పోర్న్ సినిమాకు దేవుడికి లింకు పెడుతూ జీఎస్టీ తీసిన వర్మకు చుక్కెదురైంది. ఇప్పటికే ఈ సినిమా మహిళలను కించపరిచేలా వుందంటూ మహిళా సంఘాలు మండిపడ్డాయి.
 
ఇంకా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలో వర్మను సైబర్ క్రైమ్ పోలీసులు విచారించారు. వర్మతో పాటు జీఎస్టీ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణిని కూడా విచారించనున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ ప్రారంభంలోనే ఓంకారంతో ప్రారంభం కావడంపై రచయిత జైకుమార్ కేసు పెట్టారు. ఇంకా జీఎస్టీపై యూట్యూబ్‌కు కూడా జైకుమార్ ఫిర్యాదు చేశారు. 
 
ఇలా జీఎస్టీ సినిమా మొత్తం వివాదాల్లో చిక్కుకున్న తరుణంలో.. అలాంటి చిత్రం ట్రైలర్ అవసరం లేదని య్యూటూబ్ నిర్ణయించింది. ఈ మేరకు యూట్యూబ్ నుంచి ట్రైలర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఐద్వా మహిళ మణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్మను అరెస్టు చేయాలంటూ విశాఖపట్టణంలో మహిళా సంఘాలు తమ నిరసన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.