ఆదివారం, 26 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 14 డిశెంబరు 2017 (13:04 IST)

#HBDRanaDaggubati : రానా కొత్త సినిమా లుక్ ఇదే

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన 33వ పుట్టినరోజు వేడుకలను గురువారం జరుపుకుంటున్నారు. ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెపుతున్నారు.

టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి తన 33వ పుట్టినరోజు వేడుకలను గురువారం జరుపుకుంటున్నారు. ఆయనకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెపుతున్నారు.
 
ఈ సందర్భంగా ఆయన తన కొత్త చిత్రం లుక్‌‍ను రిలీజ్ చేశారు. 1971లో హిందీలో వచ్చిన 'హాథీ మేరే సాథీ' రీమేక్‌లో రానా ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి దీనిని తెరకెక్కించనున్నారు. 
 
2018 జనవరి నుంచి భారత్‌, థాయ్‌లాండ్‌లో షూటింగ్ జరగనుందని.. 2018 దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం రానా '1945' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.